
అనన్య నాగళ్ల, యువ చంద్ర కృష్ణ జంటగా నటించిన చిత్రం ‘పొట్టేల్’. సాహిత్ మోత్ఖూరి దర్శకత్వంలో నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగె నిర్మించారు. ఇదొక రూరల్ బ్యాక్‌డ్రాప్ మూవీ. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ ఆసక్తిని పెంచాయి. అక్టోబర్ 25న ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా విడుదల చేయనున్నట్టు సోమవారం ప్రకటించారు.
దీపావళి సెలవు ఈ సినిమాకు అడ్వాంటేజ్ కానుందని మేకర్స్ చెప్పారు. అజయ్, ప్రియాంక శర్మ, తనస్వి చౌదరి, నోయల్ సీన్, ఛత్రపతి శేఖర్, శ్రీకాంత్ అయ్యంగార్ ఇతర పాత్రలు పోషించారు. శేఖర్ చంద్ర సంగీతం అందించాడు.