ఆకాశంలో ఎగురుతున్న విమానంలో పొట్టేల్ సినిమా ప్రమోషన్స్..

ఆకాశంలో ఎగురుతున్న విమానంలో పొట్టేల్ సినిమా ప్రమోషన్స్..

తెలుగు ప్రముఖ హీరోయిన్ అనన్య నాగళ్ల మరియు నూతన హీరో యువచంద్ర జంటగా పొట్టేల్ అనే సినిమా నటిస్తున్నారు. ఈ సినిమాకి సాహిత్ మోత్కురి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో సింగర్ మరియు నటుడు నోయేల్ సీన్, శ్రీకాంత్ అయ్యంగర్, అజయ్, తనస్వి చౌదరి తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. 

విలేజ్ పీరియాడిక్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవలే పొట్టేల్ చిత్ర ట్రైలర్ రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమా అక్టోబర్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. దీంతో పొట్టేల్ సినిమా యూనిట్ ప్రమోషన్స్ షురూ చేసింది. 

ALSO READ | అప్పుడో ఇప్పుడో ఎప్పుడో నుంచి "హే తార" లిరికల్ సాంగ్ రిలీజ్..

అయితే ఈ ప్రమోషన్స్ లో భాగంగా నటి అనన్య, హీరో యువచంద్ర మరియు నోయేల్ సీన్ తదితరులు విమానంలో కొంతమేర డిఫరెంట్ గా ప్రచారం చేశారు. ఈ క్రమంలో విమానంలోని ప్రయాణీకులకు పొట్టేల్ చిత్ర పాంప్లేట్లు పంచారు. అలాగే ప్రతీ ఒక్కరూ పొట్టేల్ చిత్రాన్ని థియేటర్ కి వెళ్ళి చూడాలని ప్రయాణికులను కోరారు. 

ఈ ప్రమోషన్స్ వీడియో మరియు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో బాగానే వైరల్ అవుతున్నాయి. దీంతో పలువురు అభిమానులు పొట్టేల్ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని విషెస్ తెలియజేస్తున్నారు.