పోతిరెడ్డిపాడు ఫస్ట్ ఫేజ్ ప్లాన్​ రెడీ

పోతిరెడ్డిపాడు ఫస్ట్ ఫేజ్ ప్లాన్​ రెడీ

జనవరిలో టెండర్లు పిలిచేందుకు ఏపీ సన్నాహాలు

50 రోజుల్లో 45 టీఎంసీలు తరలించే ప్లాన్

అమరావతి, వెలుగు: కృష్ణాలో అదనపు నీటిపై కన్నేసిన ఏపీ మరో అడుగు ముందుకేసింది. కృష్ణా వరదల్లో భారీగా నీటి తరలింపు చేపట్టాలన్న ప్రణాళికలకు తుది మెరుగులు దిద్దుతోంది. ఫస్ట్​ ఫేజ్ లో భాగంగా కృష్ణా నది నుంచి 50 రోజుల్లో 45 టీఎంసీల నీరు తరలించుకోవాలని ప్లాన్ రెడీ చేసుకుంది. 44 వేల క్యూసెక్కులుగా ఉన్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ కెపాసిటీని 80 వేల క్యూసెక్కులకు పెంచాలన్న సీఎం జగన్ ఆదేశాలపై ఇరిగేషన్ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

కృష్ణాలో అదనపు నీటిపై కన్నేసిన ఏపీ మరో అడుగు ముందుకేసింది. కృష్ణా వరదల్లో భారీగా నీటి తరలింపు చేపట్టాలన్న ప్రణాళికలకు తుది మెరుగులు దిద్దుతోంది. ఫస్ ఫేజ్ లో భాగంగా కృష్ణా నది నుంచి 50 రోజుల్లో 45 టీఎంసీల నీరు తరలించుకోవాలని ప్లాన్ రెడీ చేసుకుంది. 44 వేల క్యూసెక్కులుగా ఉన్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీని 80 వేల క్యూసెక్కులకు పెంచాలన్న సీఎం జగన్ ఆదేశాలపై ఇరిగేషన్ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పోతిరెడ్డిపాడు, రాయలసీమలోని కెనాల్స్ విస్తరణ కోసం తయారు చేసిన ఫస్ట్ ఫేజ్ ప్లానింగ్ డిజైన్లను సీఎంవోకు నివేదించారు. కృష్ణా నీటి వినియోగం పెంపు కోసం ఉద్దేశించిన ప్రాజెక్టును వచ్చే మూడేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకోసం పోతిరెడ్డిపాడు కెసాసిటీ పెంపు, బనకచర్ల వద్ద కెనాల్స్ నిర్మాణాలను ఈ రెండేళ్లలో పూర్తి చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఏపీ కృష్ణా నది నుంచి రోజుకు 2 టీఎంసీల చొప్పున నీటిని అదనంగా తరలించుకునే చాన్స్ వస్తుంది.

బనకచర్ల వద్ద 3 రెగ్యులేటర్లు

కృష్ణా బోర్డు కేటాయించిన నీటి వాటాతో సంబంధం లేకుండా వరద నీటిని తరలించుకుంటామని ఏపీ సర్కారు వాదిస్తోంది. ఈ ఏడాది కృష్ణా వరదల వల్ల సముద్రంలో కలిసిన 738 టీఎంసీలను సాకుగా చూపనుంది. కృష్ణా వరదల్లో సముద్రంలో కలిసే వరద వినియోగం పేరుతో కృష్ణాపై ఏపీ తన వాటాను అనధికారికంగా పెంచుకోవాలని చూస్తోంది. ఈ వాటర్ ఇయర్ లో కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు ఏపీకి వాటాగా 302 టీఎంసీలు కేటాయిస్తే అధికారులు ఇప్పటికే 407 టీఎంసీల నీటిని తరలించేశారు. సెప్టెంబర్ చివరికి 105 టీఎంసీలను అదనంగా తీసుకెళ్లారు. దీనిపై తెలంగాణ ఇరిగేషన్ అధికారులు బోర్డుకు ఫిర్యాదు చేస్తే ఏపీ ఇప్పటి వరకు సరైన వివరణ ఇవ్వలేదు. పోతిరెడ్డిపాడు విస్తరణ, రాయలసీమలోని కెనాల్స్ సామర్థ్యంపై పెంపుపై ఏపీ ఇప్పటికే ఫస్ట్ ఫేజ్ ప్లాన్ ను సిద్ధం చేసింది. దీని ప్రకారం కృష్ణాకు వరదలు వచ్చే 50 రోజుల్లో 45 టీఎంసీల నీటిని రాయలసీమకు తరలించనుంది. రెండో ఫేజ్ ప్లాన్ ప్రకారం ఏపీ రోజుకు 2 టీఎంసీల చొప్పున అదనపు నీటిని తరలించుకోనుంది. 50 రోజుల వరదల్లో 100 టీఎంసీల నీటిని రాయలసీమ ప్రాజెక్టుల్లో నింపుకోనుంది. వరద నీటి తరలింపు కోసం బనకచర్ల వద్ద 3 రెగ్యులేటర్లను నిర్మించనున్నారు. ఫస్ట్ ఫేజ్ పనుల కోసం జనవరిలో టెండర్ల ప్రక్రియ చేపట్టేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది.