నేపాల్ ప్రెసిడెంట్​గా పౌడెల్ ప్రమాణం

కాఠ్మాండు: నేపాల్ ప్రెసిడెంట్​గా సీనియర్​ నేపాలీ కాంగ్రెస్​ లీడర్​ రామ్​చంద్ర పౌడెల్ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. అధ్యక్ష కార్యాలయంలోని శీతల్ నివాస్‌‌‌‌‌‌ లో పౌడెల్​తో యాక్టింగ్ చీఫ్​ జస్టిస్ ​హరి కృష్ణ కర్కి ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి పుష్పకమల్ దహల్ ప్రచండ, వైస్​ ప్రెసిడెంట్​నందా బహదూర్ పన్, పదవీ విరమణ చేసిన ప్రెసిడెంట్ బిద్యాదేవి భండారీ, స్పీకర్ దేవ్ రాజ్ ఘిమిరే, నేషనల్ అసెంబ్లీ చైర్మన్ గణేష్ ప్రసాద్ తిమిలిన, ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

78 ఏండ్ల పౌడెల్ గత గురువారం దేశ మూడో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2008లో రిపబ్లిక్‌‌‌‌గా అవతరించిన తర్వాత నేపాల్‌‌‌‌లో ఇది మూడో అధ్యక్ష ఎన్నిక.