హైదరాబాద్, వెలుగు: దక్షిణాసియాలోనే అతిపెద్ద పౌల్ట్రీ ఎగ్జిబిషన్ బుధవారం ప్రారంభమైంది. “ పౌల్ట్రీ ఇండియా ఎక్స్‌పో 16 ఎడిషన్” ను ఈ నెల 29 వరకు హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ కాంప్లెక్స్‌లో నిర్వహిస్తున్నారు. దీనికి అనుబంధంగా మంగళవారం నోవాటెల్(ఎచ్ఐసీసీ) లో నాలెడ్జ్ డే టెక్నికల్ సెమినార్ జరిగింది . “అన్‌లాకింగ్ పౌల్ట్రీ పొటెన్షియల్” అనే అంశంపై సదస్సు జరిగింది.
విజ్ఞానాన్ని పంచుకునేందుకు, అంతర్జాతీయ పౌల్ట్రీ పరిశ్రమలో వినూత్న ఆవిష్కరణలను ప్రదర్శించడానికి ఈ అంతర్జాతీయ పౌల్ట్రీ ఎగ్జిబిషన్ ఒక వేదిక కానుంది. 50కి పైగా దేశాల నుంచి సుమారు 400 మంది ప్రదర్శకులు ఇందులో పాల్గొననున్నారు. కోళ్ళ పరిశ్రమ రైతులు, ప్రభుత్వ అధికారులు, పరిశ్రమల ఇంటిగ్రేటర్లు, ప్రపంచ పౌల్ట్రీ నిపుణులు సహా దాదాపు 40 వేల మంది సందర్శకులు రావొచ్చని అంచనా.