తూర్పుగోదావరి జిల్లాలో అగ్ని ప్రమాదం జరిగింది. పిఠాపురం మండలంలో లక్ష్మీ నర్సాపురంలో దీపావళి సందర్భంగా కాల్చిన టపాసులు కోళ్ల ఫామ్ పై పడటంతో పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో దాదాపు 1200 కోళ్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. ప్రమాదం గురించి తెలిసిన అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి వచ్చి మంటలను అర్పేశారు. అప్పటికే కోళ్ల ఫామ్ కాలిపోయింది. 4 లక్షలకు పైగా నష్టం జరగవచ్చని యజమాని అంచనా వేశారు. పండగ పూట నష్టం జరిగిందని ఆవేదన చెందాడు.
కరోనా పంజా.. 13 లక్షలు దాటిన మరణాలు