వరదల్లో ఫ్యామిలి..ఆరుగురిని కాపాడిన పోలీసులు, మత్స్యకారులు

సూర్యాపేట జిల్లాలో భారీవర్షాలు కురుస్తున్నాయి. నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలతో చెరువులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో కోదాడ మండలం నల్లబండ గూడెంలో గ్రామ శివారు ప్రాంతంలో భారీగా వరద నీరు వచ్చి చేరింది. 

ఆదివారం సాయంత్రం కూడా వర్షం పడటంతో వరద ఉధృతి పెరిగింది..దీంతో నల్లబండగూడెం శివారులో ఉన్న ఓ కోళ్ల ఫారం చుట్టు వరద నీరు భారీ ఎత్తున వచ్చి చేరింది.. కోళ్లఫారంలో పనిచేస్తున్న ఓ ఫ్యామిలి చిక్కుకుపోయింది..స్థానికుల సమాచారంతో గ్రామానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. 

స్థానిక మత్స్య కారుల సాయంతో కోళ్ల ఫారంలో చిక్కుకుపోయిన ఫ్యామిలీని కాపాడారు.  చిన్నారితో సహా మొత్తం ఆరుగురిని పోలీసులు, స్థానికులు కాపాడారు. దీంతో ఆ ఫ్యామిలీ పోలీసులకు, మత్స్యకారులకు కృతజ్ణతలు తెలిపారు.