కామారెడ్డిలో 100 నామినేషన్లు వేస్తాం: పౌల్ట్రీ ఫార్మర్స్​ అసోసియేషన్​ ప్రతినిధుల ప్రకటన

కామారెడ్డి, వెలుగు : పౌల్ర్టీ ఫార్మర్స్​ అసోసియేషన్​ తరపున అసెంబ్లీ ఎన్నికల్లో  కామారెడ్డిలో 100 నామినేషన్లు వేయనున్నట్లు ఓన్​ ఫార్మర్స్​ పౌల్ర్టీ అసోసియేషన్​ ప్రతినిధులు ప్రకటించారు. కామారెడ్డిలో గురువారం ​అసోసియేషన్​  ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న అసోసియేషన్​ స్టేట్​ ప్రెసిడెంట్ ​వెంకట్​రెడ్డి,  జిల్లా ప్రెసిడెంట్​ వెంకట్​రావు, ఇంటిగ్రేటెడ్ ​ఫార్మర్స్ ​అసోసియేషన్ ​ప్రెసిడెంట్​ శ్రీనివాస్​రెడ్డి మాట్లాడుతూ కార్పొరేట్​కు చెందిన వాళ్లే రేట్లు నిర్ణయిస్తుండడంతో పౌల్ర్టీ రైతులకు అన్యాయం జరుగుతోందన్నారు. 

పౌల్ర్టీ రంగాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలన్నారు.  ఫ్రీ కరెంట్​సప్లయ్​ చేయాలని డిమాండ్​ చేశారు. ప్రభుత్వం కొనుగోలు చేసే మక్కలను పౌల్ర్టీకి 28 శాతం సబ్సిడీతో ఇవ్వాలన్నారు. డిమాండ్ల సాధన కోసం విడతల వారీగా100 నామినేషన్లు వేస్తామన్నారు. ప్రతినిధులు విఠల్​రెడ్డి, చంద్రకాంత్​, రాము పాల్గొన్నారు.