హైదరాబాద్, వెలుగు: దక్షిణాసియాలోనే అతిపెద్ద అంతర్జాతీయ పౌల్ట్రీ ప్రదర్శన ముగిసింది. 16వ పౌల్ట్రీ ఇండియా ఎక్స్‌పో- 2024ను నవంబర్ 27 నుంచి 29 వరకు హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో నిర్వహించారు. ముగింపు వేడుకలకు త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి హాజరయ్యారు. పౌల్ట్రీ పరిశ్రమలో వినూత్న ఆవిష్కరణలను ప్రదర్శించడానికి ఇది వేదిక అయింది.
50కి పైగా దేశాల నుంచి సుమారు 400 మంది ప్రతినిధులు ఈ ప్రదర్శనకు హాజరయ్యారు. కోళ్ళ పరిశ్రమ, రైతులు, అధికారులు, పరిశ్రమల ఇంటిగ్రేటర్లు, ప్రపంచ పౌల్ట్రీ నిపుణులు సహా దాదాపు 40 వేల మంది పాల్గొన్నారు.