సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన పౌల్ట్రీ ప్రతినిధులు

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన పౌల్ట్రీ ప్రతినిధులు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: పౌల్ట్రీ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ (టీపీఎఫ్​), నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ (ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈసీసీ) ప్రతినిధులు ఆదివారం వివరించారు. కోళ్లకు వేసే మేత ధరలు పెరిగాయని, ప్రభుత్వం ఆర్థికంగా సాయం చేయాలని కోరారు.  

టీపీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాసర్ల మోహన్ రెడ్డి, జనరల్ సెక్రెటరీ ఉడుతల భాస్కర్ రావు, వైస్ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉప్పల నర్సింహ రెడ్డి, ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈసీసీ, హైదరాబాద్  చైర్మన్ గుర్రం చంద్రశేఖర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి, వైస్ చైర్మన్ వంగేటి బాలకృష్ణ రెడ్డి, ఈసీ మెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జక్క సంజీవ రెడ్డి సీఎంను కలిసి  పౌల్ట్రీ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సంక్షోభం గురించి తెలియజేశారు.