
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: రాజస్తాన్ రాయల్స్ హిట్టర్ రోవ్‌మన్ పావెల్ సొంతగడ్డపై టీ20 వరల్డ్ కప్‌లో పోటీపడే వెస్టిండీస్ టీమ్‌కు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఐపీఎల్‌లో అదరగొడుతున్న పలువురు మేటి ప్లేయర్లతో కూడిన జట్టును విండీస్ బోర్డు శుక్రవారం ప్రకటించింది. పూరన్, రసెల్, హెట్‌మయర్, రొమారియో షెఫర్డ్ తదితరులు జట్టులో ప్లేస్ దక్కించుకున్నారు. అల్జారీ జోసెఫ్ వైస్ కెప్టెన్‌గా సెలెక్ట్ అయ్యాడు.
జట్టు: రోవ్‌మన్ పావెల్ (కెప్టెన్), అల్జారీ జోసెఫ్, జాన్సన్ చార్లెస్, రోస్టన్ చేజ్, షిమ్రాన్ హెట్‌మయర్, జేసన్ హోల్డర్, షై హోప్, అకీల్ హొస్సేన్, షమర్ జోసెఫ్, బ్రెండన్ కింగ్ (కీపర్), గుడకేశ్ మోతీ, నికోలస్ పూరన్, ఆండ్రీ రసెల్, షెర్ఫాన్ రూథర్‌ఫొర్డ్, రొమారియో షెఫర్డ్.