ఆర్థిక సంక్షోభంలో శ్రీలంక.. వలస బాటపట్టిన జనం

కొలంబో: ఆర్థిక సంక్షోభంతో శ్రీలంక అల్లాడిపోతోంది. ధరలు కొండెక్కడంతో తినేందుకు తిండిలేక జనం ఆకలితో అలమటిస్తున్నారు. నిత్యావసరాల కోసం గంటలకొద్దీ క్యూలో నించున్నా.. సరుకులు దొరుకుతాయన్న గ్యారెంటీ లేదు. కరెంటు లేక చీకట్లోనే కాలం వెళ్లదీస్తున్నారు. విదేశీ మారక నిల్వలు లేకపోవడంతో దిగుమతులు నిలిచిపోయాయి. అత్యవసర మందులు సైతం అందుబాటులో లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ కష్టాలు భరించలేక జనం వలసబాటపడుతుంటే.. అలా వెళ్లలేని వారు అక్కడే కాలం వెళ్లదీస్తున్నారు. 

శ్రీలంకవాసులు గత్యంతరం లేని పరిస్థితుల్లో సముద్రం మార్గం ద్వారా రామేశ్వరం, ధనుష్కోడి ప్రాంతాలకు తరలివస్తున్నారు. లంకలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరగడం వల్ల అనేక కుటుంబాలు తమ దేశాన్ని విడిచిపెట్టి అక్రమంగా భారత తీరాలకు చేరుకుంటున్నాయి. శ్రీలంక పౌరులు బోట్ల ద్వారా భారత్‌కు చేరుకున్నారు. ఇలా అక్రమంగా వస్తున్న వారిని తమిళనాడు మెరైన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు శ్రీలంక తమిళుల కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. పునరావాస కేంద్రాన్ని నెలకొల్పి వసతి కల్పిస్తోంది. రామేశ్వరంలో శ్రీలంక తమిళుల పునరావాస కేంద్రానికి వలసదారుల తాకిడి పెరుగుతోంది. 

మరిన్ని వార్తల కోసం..

సాధించాలంటే కసి ఒక్కటే సరిపోదు.. అంతే కష్టపడాల

రెండేళ్లుగా కారులోనే నివాసముంటున్న మహిళ