- అక్టోబర్ 28 నుంచి నామినేషన్లు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్ర పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్ (టీజీపీఈఏ)సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ కొత్త ఆఫీస్ బేరర్లను ఎన్నుకోవడానికి ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించిందని సంఘం సెక్రటరీ జనరల్ సదానందం తెలిపారు. పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్ కొత్త కమిటీ నవంబర్ 2024 నుంచి మూడేండ్ల పాటు కొనసాగనుందని చెప్పారు. ఈ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల అధికారిగా డీఈకే సమ్మయ్యను నామినేట్ చేశామని పేర్కొన్నారు. బాధ్యతలు స్వీకరించిన సమ్మయ్య శనివారం ఎన్నికల నోటిఫికేషన్ ను విడుదల చేశారు.
ఈ నెల 28 నుంచి 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్లను నవంబర్ 4వ తేదీ వరకు ఉపసంహరించుకోవచ్చు. నవంబర్8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు బ్యాలెట్పేపర్లు ఇష్యూ చేస్తారు. రహస్య బ్యాలెట్ తో ఎన్నికలను వచ్చే నెల 13న నిర్వహించనున్నారు. తెలంగాణ పవర్ యుటిలిటీస్ జెన్ కో, ట్రాన్స్ కో, డిస్కంలలో పని చేస్తున్న అసిస్టెంట్ ఇంజినీర్ కేడర్ నుంచి చీఫ్ ఇంజినీర్ వరకు అందరూ ఎన్నికల్లో పాల్గొనాలని రిటర్నింగ్ అధికారి సమ్మయ్య కోరారు. నవంబర్ 15న ఫలితాలను ప్రకటిస్తారని వెల్లడించారు.