పాలేరులో విద్యుత్​ ఉత్పత్తి షురూ..

పాలేరులో విద్యుత్​ ఉత్పత్తి షురూ..

కూసుమంచి, వెలుగు : పాలేరు మినీ హైడల్​ కేంద్రంలో విద్యుత్​ ఉత్పత్తిని నాగార్జున సాగర్​ జెన్ ​కో​ సీఈ మంగేశ్​కుమార్, పులిచింతల ఎస్ఈ దేశ్యా శుక్రవారం ప్రారంభించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ రెండు టర్భన్లు 1993 నాటివి కావడంతో అందులో ఒకటి పని చేయడం లేదన్నారు. దీనిని క్యాఫిటల్​ ఓవర్​ హాలింగ్​కు బెంగళూర్​కు పంపామని చెప్పారు.

మినీ హైడల్ ​కేంద్రంలో 2మోగావాట్ల విద్యుత్​ ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉందన్నారు. పాలేరు జలాశయంలో నీటిమట్టం 18 అడుగులు ఉండి, చెరువు కాల్వ 8 అడుగులు ఉంటేనే విద్యుత్​ ఉత్పత్తికి సహకరిస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఈ నర్సింహారావు, ఏడీఈ పద్మజా, ఏఈ అఖిల్, సిబ్బంది పాల్గొన్నారు.