
పద్మారావునగర్, వెలుగు: ఘట్కేసర్ పవర్‌గ్రిడ్ సంస్థలో చీఫ్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న నర్సింగరావు బ్లేడ్‌తో గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సీతాఫల్‌మండి డివిజన్ మేడిబావికి చెందిన ఎస్ నర్సింగరావు (52) శ్రీలత దంపతులు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నర్సింగరావు కొన్నేండ్లుగా మానసిక రుగ్మతలతో బాధపడుతున్నాడు. వీరి ఫ్యామిలీ మెంబర్స్మధ్య ప్రాపర్టీ గొడవలు కూడా కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం 6.30 గంటల సమయంలో బాత్‌రూమ్‌కు వెళ్లి లోపల నుంచి గొళ్లెం పెట్టుకున్నాడు.
ఎంత పిలిచినా స్పందించలేదు. దాంతో కుటుంబ సభ్యులు స్థానికుల సహాయంతో బాత్‌రూమ్ తలుపులు పగలకొట్టి చూడగా బ్లేడ్‌తో గొంతు కోసుకుని రక్తపు మడుగులో విగతజీవిగా పడున్నాడు.ఈస్ట్‌జోన్ అడిషనల్ డీసీపీ నర్సయ్య, చిలకలగూడ ఏసీపీ జైపాల్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్ అనుదీప్, డీఐ రమేశ్ గౌడ్, ఎస్‌ఐ సబితలు ఘటనస్థలాన్ని పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. డెడ్‌బాడీని పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.