పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (PGCIL) న్యూఢిల్లీలో ఇంజనీర్స్ ట్రైనీ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. PGCILతోపాటు సెంట్రల్ ట్రాన్స్ మిషన్ యుటిలిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లోని వివిధ విభాగాల్లో పలు ఇంజనీర్స్ ట్రైనీ ఖాళీలను భర్తీ చేయనున్నారు.అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంజనీరింగ్ డిగ్రీతోపాటు గేట అర్హత కలిగి ఉండాలి. ఆన్ లైన్ ద్వారా జూలై 4 వరకు ఈపోస్టులకు దరఖాస్తు చేసుకోవవచ్చు.
మొత్తం ఖాళీలు: 435
పోస్టుల కేటాయింపు: జనరల్ -192, ఓబీసీ -107, ఎస్సీ -63, ఎస్టీ -34, ఈడబ్ల్యూఎస్-39 కేటాయించారు.
పోస్టుల ఖాళీల వివరాలు
ఎలక్ట్రికల్ -331 పోస్టులు, ఎలక్ట్రానిక్స్ -14 పోస్టులు, సివిల్ -53 పోస్టులు, కంప్యూటర్ సైన్స్ -37 పోస్టులు,
ఏజ్ లిమిట్స్ : అభ్యర్థులు 18-28 ఏళ్ళ మధ్య ఉండాలి. వయసు పరిమితిలో సడలింపులు ఉంటాయి. ఓబీసీలకు 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీలకు 5ఏళ్లు, దివ్యాంగులకు 10ఏళ్లు,ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు కూడా సడలింపు ఉంటుంది.
దరాఖాస్తు ఫీజు: రూ. 500 (దివ్యాంగులు , ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది)
ఎంపిక విధానం: గెట్ – 2024 స్కోర్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పే స్కేల్: రూ. 40,000 నుంచి రూ. 1,40,000.
దరఖాస్తులకు చివరితేది: 04.07.2024