
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆర్‌డీ సెక్టార్ రీఫార్మ్ స్కీమ్(ఆర్‌డీఎస్‌ఎస్)లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఇంజినీర్, సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌లో అప్లికేషన్స్ కోరుతోంది.
పోస్టులు: మొత్తం 800 పోస్టుల్లో ఫీల్డ్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్)–50, ఫీల్డ్ ఇంజినీర్ (ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్)–15, ఫీల్డ్ ఇంజినీర్ (ఐటీ)–15, ఫీల్డ్ సూపర్‌వైజర్ (ఎలక్ట్రికల్)–480, ఫీల్డ్ సూపర్‌వైజర్ (ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్)–240 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి.
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ, బీటెక్, బీఎస్సీ(ఇంజినీరింగ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 18 నుంచి 29 మధ్య ఉండాలి. స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామ్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో నవంబర్ 21 నుంచి డిసెంబర్ 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలకు www.powergrid.in వెబ్సైట్లో సంప్రదించాలి.