కులగణనపై ఫిబ్రవరి 14న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్

కులగణనపై ఫిబ్రవరి 14న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్

హైదరాబాద్, వెలుగు : పీసీసీ ఆధ్వర్యంలో ఈ నెల 14న మధ్యాహ్నం 2 గంటలకు గాంధీ భవన్ లోని ప్రకాశం హాల్ లో  కుల గణన, ఎస్సీ వర్గీకరణపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ అధ్యక్షతన జరగనున్న ఈ ప్రోగ్రామ్ కు చీఫ్ గెస్టులుగా సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ దీపాదాస్ మున్షి పాల్గొననున్నారు.

కుల గణన, ఎస్సీ వర్గీకరణపై డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎంపీ మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారని పీసీసీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రోగ్రామ్ లో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పీసీసీ ఆఫీసు బేరర్లు, డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ ఛార్జీలు పాల్గొంటారని పీసీసీ పేర్కొంది.