ఎమ్మెల్యే వివేక్​ వెంకట స్వామి చొరవతో తొలగిన కరెంట్​ ఇబ్బందులు

చెన్నూరు వెలుగు: ఎమ్మెల్యే వివేక్​ వెంకట స్వామి చొరవతో ముత్తరావుపల్లిలో కరెంట్​కష్టాలు తీరాయి. ఎక్కువ లోడు కారణంగా చెన్నూరు మండలంలోని ముత్తరావుపల్లిలో నిత్యం కరెంట్​కోతలు ఏర్పడుతుండగా.. విషయాన్ని స్థానికులు కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యే వివేక్ దృష్టికి తీసుకె ళ్లారు. వెంటనే స్పందించి ఆయన.. అదనంగా గ్రామంలో మరో ట్రాన్స్​ఫార్మర్​ను ఏర్పాటు చేయాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు.

వెంటనే స్పందించిన అధికారులు ముత్తరపల్లిలో అదనంగా ట్రాన్స్​ఫార్మర్​ని ఏర్పాటు చేశారు. దీంతో ఆ గ్రామంలో కరెంటు కష్టాలు తీరాయి. దీంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కోరిన వెంటనే అధికారులతో మాట్లాడి తమ సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి కృతజ్ఞతలు తెలిపారు