నిర్లక్ష్యంతో నిలిచిన కరెంట్ సప్లై

నిర్లక్ష్యంతో నిలిచిన కరెంట్ సప్లై

జీడిమెట్ల, వెలుగు: జీడిమెట్ల రాంరెడ్డినగర్​లో సోమవారం ఉదయం స్విచ్​ గేర్ పరిశ్రమ వద్ద ఉన్న కరెంట్​ పోల్​ను గుర్తు తెలియని వాహనం ఢీ కొంది. దీంతో కాలనీలోని సగభాగం ఇండ్లకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.  దీంతో స్థానికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఉదయం 9 గంటలకు  ఘటన జరిగితే సోమవారం రాత్రి 10 గంటల వరకు కూడా విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించలేదు. 

కరెంట్ పోల్ ప్రమాదకరంగా పక్కకు ఒరిగిఉంది. దీంతో అధికారుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఏడీఈ వీరేశలింగంను సంప్రదించగా,  ఆదివారం రాత్రి వర్షం పడడంతో ఇంపార్ట్​టెంట్​పనులకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు. పని ఒత్తిడితో సమస్య పరిష్కరించలేకపోయామని చెప్పారు.