
పసిఫిక్ ద్వీప దేశమైన టోంగాలోభూకంపం సంభవించింది. విక్టర్ స్కేల్ పై 7.1 తీవ్రత నమోదు అయింది. టోంగా ప్రధాన ద్వీపానికి ఈశాన్యంగా దాదాపు 100కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చిందని యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది. దీంతో పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం సునామి వార్నింగ్ జారీ చేసింది. భూకంప కేంద్రం నుంచి 300 కిలోమీటర్ల పరిధిలోని తీర ప్రాంతాల్లో ప్రమాదకరమైన సముద్రపు అలలు బీభత్సం సృష్టించే అవకాశం ఉందని హెచ్చరించింది.
టోంగా దక్షిణ 171 పసిఫిక్ దీవులతో కూడిన పాలినేషియన్ రాజ్యం. ఈ దేశంలో లక్ష మందికి పైగా జనాభా ఉంది. వీరిలో టోంగాలోని టోంగాటపు ప్రధాన ద్వీపంలో ఎక్కువ మంది నివసిస్తున్నారు. ఈ దేశం ఆస్ట్రేలియా తూర్పు తీరానికి 3వేల 500 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఎక్కువగా భూకంపాలు సంభవించే పసిఫిక్ రింక్ ఆఫ్ ఫైర్ లో ఉంది. దీంతో ఇక్కడ సునామీ సంభవించే అవకాశం ఉందని USGS తెలిపింది.
ALSO READ | మయన్మార్ భూకంప మృతులు 1,644 .. శిథిలాల కిందే వేలాది మంది?
ఈ భూకంపం టోంగా దీవుల్లో ఇటీవల జరిగిన భూకంపాలను గుర్తు చేస్తుంది. ఇది దక్షిణ పసిఫిక్ ప్రాంతంలో కొనసాగుతున్న భౌగోళిక అస్థిరతను హైలైట్ చేస్తుంది.టోంగాలో భూకంపాలు సర్వసాధారణం..ఎర్త్ కేక్ రింగ్ ఆఫ్ ఫైర్ పరిధిలో ఉంది. లోతట్టు ద్వీపసమూహం - ఆగ్నేయాసియా ,పసిఫిక్ బేసిన్ అంతటా విస్తరించి ఉన్న తీవ్రమైన టెక్టోనిక్ కార్యకలాపాల ఆర్క్ ఇది.
అయితే టోంగా దీవులు ఆస్ట్రేలియాకు దగ్గరగా ఉండటంతో భూకంపాలతో ఆస్ట్రేలియాకు సునామీ ప్రమాదం ఉందని భావిస్తుండగా సునామీ హెచ్చరికలపై ఆ దేశం స్పందించింది. ఎలాంటి ప్రమాదం లేదని ఆస్ట్రేలియా మెటోరాలిజికల్ బ్యూరో ప్రకటించింది.