రష్యాలో భూకంపం.. సునామీ హెచ్చరికలు

రష్యాలో భూకంపం.. సునామీ హెచ్చరికలు

రష్యాలో తీవ్ర భూకంపం సంభవించింది. ఆదివారం తెల్లవారుజామున రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 7.0 గా నమోదైంది. రష్యా తూర్పు తీరంలోని మెయిన్ నావెల్ హెడ్‌క్వర్టర్‌కు సమీపాన భూమి ఒక్కసారిగా కంపించింది. దీంతో భయంతో జనం రోడ్లపైకి పరుగులు తీశారు. ఆస్థి నష్టం, ప్రాణ నష్టం గురించి ఇంకా వివరాలు అందలేదని అధికారులు తెలిపారు. పెట్రోపావ్‌లోవ్స్క్, కమ్‌చట్‌స్కీ భూకంప కేంద్రాలుగా ప్రకంపనలు వచ్చాయని US జియోలాజికల్ సర్వే తెలిపింది. 

వెంటనే రష్కాలోని తీరప్రాంతాలకు సునామీ వచ్చే అవకాశం ఉందని US నేషనల్ వెదర్ సర్వీస్ యొక్క పసిఫిక్ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. తర్వాత ప్రమాదం తగ్గిందని తెలిపారు. భూకంపం సంభవించిన ప్రాంతానికి సమీపంలోని తీర ప్రాంతాల్లో కొన్ని గంటలపాటు సముద్ర మట్టంలో స్వల్ప హెచ్చుతగ్గులు ఏర్పడవచ్చని అధికారులు తెలిపారు.