అఖండ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాలకృష్ణ నటిస్తున్న సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉండటం కామన్. అందుకు తగ్గట్టే దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా పవర్‌ఫుల్ స్టోరీతో ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తీస్తు
న్నాడు. ప్రస్తుతం ఈ మూవీ టైటిల్ గురించి టాలీవుడ్‌లో పెద్ద చర్చే జరుగుతోంది. రకరకాల పేర్లు వినిపించాయి కానీ చివరికి ‘అన్నగారు’ అని పెట్టేందుకు రెడీ అయ్యారట. జూన్ 10న బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా టైటిల్‌ని అనౌన్స్ చేయడంతో పాటు వీడియో గ్లింప్స్‌ని కూడా రిలీజ్ చేయనున్నట్లు తెలిసింది. షూటింగ్ కూడా శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. అదిరిపోయే మాస్ ఎలివేషన్స్‌తో యాక్షన్ సీన్స్ డిజైన్ చేశారట రామ్, లక్ష్మణ్. కీలక షెడ్యూల్ కోసం త్వరలోనే ఫారిన్ వెళ్లనున్నారు. శ్రుతీహాసన్ హీరోయిన్. ఇదిలా ఉంటే బోయపాటి, బాలయ్య కాంబోలో మరో మూవీ రాబోతోందనే గుసగుసలు మొదలయ్యాయి. ఇదో పొలిటికల్ డ్రామా అని, ‘లెజెండ్’కి సీక్వెల్ అని అంటున్నారు. ‘అఖండ’ ప్రొడ్యూసర్ మిర్యాల రవీందర్ రెడ్డియే ఈ చిత్రాన్ని కూడా నిర్మించనున్నారట. ఈ వార్త ఎంతవరకు నిజమో తెలీదు కానీ.. ఆల్రెడీ అనిల్ రావిపూడితో బాలయ్యకి కమిట్‌మెంట్ ఉంది. అలాగే రామ్‌తో బోయపాటి సినిమా ఫిక్సయ్యింది. ఈ రెండూ పూర్తయ్యాకే వీరి కాంబోలో సినిమా పట్టాలెక్కే చాన్స్ ఉంది.