శేఖర్ కమ్ముల ‘కుబేర’ ఫస్ట్ సాంగ్ వచ్చేసింది.. స్వయంగా పాడి అదరగొట్టిన ధనుష్

శేఖర్ కమ్ముల ‘కుబేర’ ఫస్ట్ సాంగ్ వచ్చేసింది.. స్వయంగా పాడి అదరగొట్టిన ధనుష్

ధనుష్, నాగార్జున లీడ్ రోల్స్‌‌లో శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న చిత్రం ‘కుబేర’. రష్మిక హీరోయిన్‌‌గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు జిమ్ సర్ఫ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు కలిసి నిర్మిస్తున్నారు. జూన్ 20న సినిమా విడుదల కానుంది. తాజాగా మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్.. ఆదివారం ఫస్ట్ సాంగ్‌‌ను రిలీజ్ చేశారు. దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ పాటకు  భాస్కరభట్ల రాసిన సాహిత్యం అందరినీ అలరిస్తుంది. ధనుష్ స్వయంగా పాడి  మరింత ఎనర్జీని తీసుకొచ్చాడు.

‘పోయిరా  పోయిరా.. పోయిరా మావ.. అరె  రాజాలాగ  దర్జాగా పోయిరా మావ.. చూస్తూ చూస్తూనే మారింది నీ రేంజ్ ఈరోజున.. నిన్నే అందుకోవాలి అనుకుంటే సరిపోదే ఏ నిచ్చెన.. సొమ్ములైన, సోకులైన తలొంచవ నీ ముందర.. నిన్నే కొనే ఐసా పైసా ఈ లోకంలో ఏడుందిరా.. నిన్నే తిట్టి గల్లా పట్టి సతాయించే సారే  లేడురా..’ అంటూ సాగిన  పాట  ఆకట్టుకుంది.

శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో  ధనుష్ చేసిన సింపుల్ డ్యాన్స్ మూమెంట్స్ ​ఇంప్రెస్ చేస్తున్నాయి.   ఐదు భాషల్లో రిలీజ్  చేసిన  ఈ పాటను తెలుగు, తమిళ భాషల్లో ధనుష్ స్వయంగా పాడాడు.  ఇప్పటికే ఈ  సినిమాలోని నాలుగు ప్రధాన పాత్రలను పరిచయం చేయడంతో పాటు  విడుదల చేసిన   ఫస్ట్ గ్లింప్స్‌‌, ఈ  సాంగ్  సినిమాపై అంచనాలను పెంచింది.