
న్యూఢిల్లీ: కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్‌కు హాకీ ఇండియా (హెచ్‌ఐ) అరుదైన గౌరవాన్ని కల్పించింది. ఇన్నాళ్లూ అతను ధరించిన ‘16వ నంబర్ జెర్సీ’కి వీడ్కోలు పలికింది. సీనియర్ టీమ్‌లో ఏ ప్లేయర్‌కు కూడా ఈ జెర్సీ నంబర్‌ను కేటాయించబోమని హెచ్‌ఐ సెక్రటరీ జనరల్ భోలా నాథ్ సింగ్ తెలిపారు. జూనియర్ స్థాయిలో మాత్రం ఈ జెర్సీ అందుబాటులో ఉంటుందన్నారు.
హాకీకి శ్రీజేష్ చేసిన సేవలు అద్భుతమని ప్రెసిడెంట్ దిలీప్ టిర్కీ అన్నారు. శ్రీజేష్ ‘ఆధునిక భారత హాకీ దేవుడు’ అని అభివర్ణించారు. రెండు దశాబ్దాల ఇంటర్నేషనల్ కెరీర్ కలిగిన లెజెండ్ ప్లేయర్‌ను జూనియర్ టీమ్‌కు కోచ్‌గా చేస్తున్నామని అధికారికంగా ప్రకటించారు. హాకీ ఇండియా తీసుకున్న నిర్ణయం తనను భావోద్వేగానికి గురి చేసిందని శ్రీజేష్ అన్నాడు.