
కొడిమ్యాల, వెలుగు: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లి జేఎన్టీయూ ప్రిన్సిపాల్ గా డాక్టర్ బి.ప్రభాకర్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ప్రిన్సిపాల్ గా పనిచేసిన కామాక్షి ప్రసాద్ హైదరాబాద్ జేఎన్టీయూకు ట్రాన్స్‌ఫర్ అయ్యారు. ప్రభాకర్ ప్రస్తుతం ఇదే కాలేజీలో ఈసీఈ డిపార్ట్‌మెంట్ హెచ్వోడీ గా పనిచేస్తున్నారు.