చౌటుప్పల్ వెలుగు: చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం చౌటుప్పల్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన పద్మశాలీ జిల్లా అధ్యక్షుల అభినందన సభలో ఆయన మాట్లాడారు.
చేనేతల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళతానన్నారు.వారికి ఎల్లవేళలా అండగా ఉంటానన్నారు. చేనేత సంఘ రాష్ట్ర అధ్యక్షుడు రామా శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలోని చేనేత కార్మికులలు ఐక్యంగా సమస్యల పరిష్కారానికి పోరాడాలని సూచించారు. జిల్లా పద్మశాలి సంఘ అధ్యక్షుడిగా ఎన్నికైన చిరందాసు ధనుంజయను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో చిట్టిపోలు శ్రీనివాస్, చుంచు నాగభూషణం, తడక రమేశ్, రాపోలు వీర మోహన్, సంఘం నాయకులు పాల్గొన్నారు.