మంచు విష్ణు(Manchu Vishnu) ప్రధాన పాత్రలో వస్తున్న లేటెస్ట్ మైథలాజికల్ మూవీ కన్నప్ప(Kannappa). పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం స్విట్జర్లాండ్ లో జరుగుతోంది. దాదాపు రూ.100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం.
అయితే ఈ సినిమాలో శివుడిగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) నటిస్తున్న విషయం కూడా తెలిసిందే. ఈ విషయంపై హీరో మంచు విష్ణు ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశాడు. ఇక పార్వతిగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటించనుందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే.. తాజాగా ప్రభాస్ శివుడి లుక్ కి సంబంధించి ఏఐ జెనరేటెడ్ పిక్ ఒకటి నెట్టింట వైరల్ గా మారింది.
Also Read :- మల్టీ లేయర్స్ ఉన్న కమర్షియల్ సినిమా మామా మశ్చీంద్ర
ఆ ఫొటోలో ప్రభాస్ లుక్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. దీంతో ఫ్యాన్స్ అందరికి ఈ ఏఐ జెనరేటెడ్ శివుడి లుక్ తెగ నచ్చేసింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ మంచు విష్ణును రిక్వెస్ట్ చేస్తున్నారు. కన్నప్ప సినిమాలో ప్రభాస్ శివుడి లుక్ ఏఐ వెర్షన్ లుక్ లాగే చూపించాలని, కనీసం ఆలా చూపించేందుకు ప్రయత్నం చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి ఫ్యాన్స్ రిక్వెస్ట్ పై మంచు విష్ణు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.