Bangalore Fan War: బెంగుళూరులో తెలుగు హీరోల ఫ్యాన్ వార్.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ వీరంగం

అభిమానం ఉండొచ్చు కానీ, అది హద్దులు దాటకూడదు. కొంతమంది అభిమానం పేరుతో చేసే రచ్చ మాములుగా ఉండదు. అయితే అందరూ అలానే ఉన్నారని చెప్పడం లేదు. చాలా మంది తమ అభిమాన హీరో పేరు మీద ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. అలా కాకుండా.. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ ఫ్యాన్ వార్ కు దిగుతున్నారు. ఇటీవల బెంగళూరు సిటీలో ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. ఇద్దరు స్టార్ హీరోల అభిమానులు ఫ్యాన్ వార్ కు దిగారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. బెంగళూరు లోని ఒక గ్రౌండ్ లో కొంతమంది వ్యక్తులు ఓ వ్యక్తిని చొక్కా పట్టుకుని లాగుతూ రక్తం వచ్చేలా కొట్టారు. జై అల్లు అర్జున్‌ అనమంటూ.. అక్కడ ఉన్న వాళ్లంతా ఆ వ్యక్తిపై పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 

ALSO READ :-హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

ఇది చూసిన నెటిజన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ పై మండిపడుతున్నారు. ఒక్కొక్కరికి ఒక్కో హీరో అంటే అభిమానం ఉంటుంది. అలా కాకుండా ఇంత దారుణంగా ప్రవర్తించడం కరక్ట్ కాదు. ఆ వ్యక్తులపై తగిన చర్యలు తీసుకోవాలంటూ బెంగళూరు పోలీసులను ట్యాగ్‌ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ ఘటనపై బెంగుళూర్ పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాలి.