టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి(Anushka Shetty) ని తెరపై చూడాలని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. నవీన్ పోలిశెట్టితో ఈ హీరోయిన్ నటించిన సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అయినా స్వీటీ ఫ్యాన్స్ సాటిస్ఫై అవ్వడం లేదు. ఈ నేపథ్యంలో ఓ క్రేజీ న్యూస్ నెట్టింట హల్చల్ చేస్తోంది.
ప్రభాస్(Prabhas) తో కలిసి అనుష్క ఓ భారీ ప్రాజెక్ట్‌లో నటించనున్నట్టు తెలుస్తోంది. ప్రాజెక్ట్ కె తర్వాత మారుతి( Maruthi) దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేయనున్నాడు. ఇందులో అనుష్కను నటించాలని కోరాడట. అయితే, హీరోయిన్గా మాత్రం కాదని తెలుస్తోంది. స్టోరీలో భాగంగా ఓ కీ రోల్లో ఈ బ్యూటీ కనిపించనున్నట్టు టాక్. ఈ వార్తపై ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు.
బాహుబలిలో వీరిద్దరి కెమిస్ట్రీకి సౌత్‌తో పాటుగా నార్త్ ఆడియెన్స్ కూడా ఫిదా అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాతో మరోసారి ఇలాంటి మ్యాజిక్ రిపీట్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.