అన్స్టాపబుల్ టాక్ షోతో (ఆహాలో) బాలక్రిష్ణ ఓటీటీ ప్లాట్ ఫామ్ ని షేక్ చేస్తున్నాడు. ఫిల్మ్ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులతో జరిపే ముచ్చట్లతో ప్రేక్షకులను అలరిస్తూ హోస్ట్ గా అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. గత సీజన్ కు వచ్చిన సూపర్ రెస్పాన్స్ తో, రెండో సీజన్ మొదలుపెట్టాడు. ఈ సీజన్ తొలి ఎపిసోడ్ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ తో మొదలుపెట్టి అదే హవాను కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు అన్స్టాపబుల్ షోకి వచ్చారు. తదుపరి గెస్ట్ గా రెబల్ స్టార్ ప్రభాస్ రాబోతున్నాడు. దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది.
అందులో ప్రభాస్ తో పాటు హీరో గోపిచంద్ కూడా అన్స్టాపబుల్ వేదికను పంచుకున్నాడు. ఈ ఇద్దరి జర్నీ, స్నేహం గురించి బాలయ్య బాబుతో పంచుకున్నారు. భోజన ప్రియుడైన ప్రభాస్ అతిధి మర్యాదలు ఎలా చేస్తాడో అందరికీ తెలిసిన విషయమే. అయితే, ఈ షోకు గెస్ట్ గా వచ్చిన ప్రభాస్, తనతో పాటు పెద్ద క్యారేజ్ ని కూడా తీసుకురావడం షో మొత్తానికి హైలైట్. ఈ ఎపిసోడ్ త్వరలో ప్రసారం కాబోతుంది.