మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘భక్త కన్నప్ప’. ఇటీవల శ్రీకాళహస్తిలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో మోహన్ బాబు నిర్మిస్తున్నారు. మహాభారతం సీరియల్‌కు దర్శకత్వం వహించిన ముఖేశ్ కుమార్ సింగ్ ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై మంచి బజ్ నెలకొంది. ఇందులో బాలీవుడ్, టాలీవుడ్ ఫేమస్ నటీనటులు కీలకపాత్రలలో నటించనున్నారని తెలుస్తోంది. తాజాగా ఈ చిత్రంలో ప్రభాస్ కూడా నటించనున్నాడనే ప్రచారం జరుగుతోంది.
ఈ కామెంట్స్‌కు ‘హర హర మహాదేవ్’ అంటూ మంచు విష్ణు రిప్లై ఇవ్వడంతో ఈ న్యూస్‌లో నిజముందని తెలుస్తోంది. దీంతో ప్రభాస్ ఈ చిత్రంలో శివుడిగా కనిపించనున్నాడని హింట్ ఇచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు. వీరిద్దరి మధ్య మంచి ఫ్రెండ్‌షిప్ ఉంది. దీని కారణంగానే ప్రభాస్ ఈ చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసేలా విష్ణు ప్లాన్ చేస్తున్నారు. పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయి మాధవ్, తోట ప్రసాద్ ఈ చిత్రానికి రచయితలుగా పని చేస్తున్నారు.