ప్రభాస్ సినిమా అంటే మినిమమ్ వంద కోట్ల బడ్జెట్‌తో మొదలవుతుంది. మ్యాగ్జిమమ్ ఎంతనేది ఊహించడం ఎవరికైనా కష్టమే అవుతుంది. దేశ సరిహద్దులు సైతం దాటి వెళ్లిపోయింది తన ఇమేజ్. అందుకే అతను చేసే ప్రతి సినిమానీ ప్రెస్టీజియస్‌గానే తీసుకుంటున్నారు మేకర్స్. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్నవన్నీ ప్యాన్ ఇండియా సినిమాలే. వాటిలో ‘ఆదిపురుష్’ ఒకటి. ప్రభాస్ రాముడిగా కనిపించనున్న ఈ చిత్రంలో కృతీ సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా నటిస్తు న్నారు. ఓం రౌత్ దర్శకుడు. ఆగస్ట్ 11న చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించి చాలా కాలమైంది. అనుకున్న సమయానికి రావడం కోసం శరవేగంగా షూటింగ్‌ను పూర్తి చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. ముఖ్యంగా వీఎఫ్‌ఎక్స్ వర్క్ విషయంలో చాలా పట్టుదలగా ఉన్నాడు ఓం. అరవై దేశాలకు చెందిన టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు. ‘అవతార్’ మూవీ కోసం ఉపయోగించిన టెక్నాలజీని యూజ్ చేస్తున్నారట. రీసెంట్‌గా మరో ఇంటరెస్టింగ్ విషయం కూడా రివీలయ్యింది. ఐదు వందల కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో ఒక సీన్ కోసం ఏకంగా అరవై కోట్లు ఖర్చు పెట్టాడు దర్శకుడు. అరణ్యవాసానికి సంబంధించిన ఎపిసోడ్‌లో వచ్చే సీన్ కావడంతో దాన్ని చాలా స్పెషల్‌గా ప్లాన్ చేశాడట రౌత్. ఇవన్నీ వింటుంటే ఇంతవరకు ఉన్న అంచనాలు రెట్టింపవుతున్నాయి. ప్రభాస్ కెరీర్‌లో ఇదో డిఫరెంట్ అండ్ బెస్ట్ మూవీ అవుతుందని ఓం చెప్పిన మాటలు కచ్చితంగా నిజమవుతాయనిపిస్తోంది.