Prabhas: ఇండియాలో ఒకే ఒక్కడు.. కల్కి మూవీతో ప్రభాస్ అరుదైన రికార్డ్

Prabhas: ఇండియాలో ఒకే ఒక్కడు.. కల్కి మూవీతో ప్రభాస్ అరుదైన రికార్డ్

వరల్డ్ బాక్సాఫీస్ దగ్గర కల్కి సినిమా దుమ్ములేపుతోంది. కలెక్షన్ల సునామి సృష్టింస్తోంది. జూన్ 27న విడుదలైన ఈ సినిమాకు పాజిటీవ్ టాక్ రావడంతో ప్రేక్షకులు ఈ సినిమా చూసేందుకు ఎగబడుతున్నారు. దీంతో అదిరిపోయే కలెక్షన్స్ రాబడుతోంది. ఇండియన్ మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ కథాంశంతో వచ్చిన ఈ సినిమా మొదటి రోజు ఏకంగా రూ.191 కోట్ల గ్రాస్ రాబట్టి ఈ ఇయర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక ప్రభాస్, అమితాబ్, కమల్, దీపికాల నటన, అద్భుతమైన గ్రాఫిక్స్, ఆశ్చర్యపరిచే విజువల్ ఎఫెక్ట్స్, మహాభారతం సీన్స్ వెరసి సినిమాను నెక్స్ట్ లెవల్లో నిలబెట్టాయి. ఇక ఇలాంటి కథను ఎంచుకున్నందుకు దర్శకుడు నాగ్ అశ్విన్ పై దేశవ్యాప్తంగా ఉన్న స్టార్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.

అయితే.. ఈ సినిమాతో ప్రభాస్ ఇండియాలో ఏ స్టార్ హీరోకి కూడా లేని అరుదైన రికార్డ్ ఒకటి క్రియేట్ చేశాడు. అదేంటంటే.. వరుసగా ఐదు సినిమాలు వందకోట్లకు పైగా ఓపెనింగ్స్ సాధించిన హీరోగా నిలిచాడు. బాహుబలి తరువాత ప్రభాస్ చేసిన ప్రతీ సినిమా ఓపెనింగ్ డే వందకోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. అందులో బాహుబలి 2 రూ.217 కోట్లు, సాహూ రూ.130 కోట్లు, ఆదిపురుష్ రూ.140 కోట్లు, సలార్ రూ.178 కోట్లు ఇప్పుడు కల్కి రూ.191 కోట్ల వసూళ్లు కలెక్ట్ చేశాయి. దీంతో.. ఈ రికార్డ్ క్రియేట్ చేసిన ఒకే ఒక్క హీరోగా ప్రభాస్ రికార్డ్ క్రియేట్ చేశాడు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ అంటే ఒకడే.. అది ప్రభాసే.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.