సినిమాల్లో మన హీరోలు ఫైట్స్, యాక్షన్ సీక్వెన్సెస్, రిస్కీ షాట్స్ చేయడం చూసి ఆడియన్స్ విజిల్స్ వేస్తూ హంగామా చేయడం మనం చూస్తూనే ఉంటాం. నిజంగా ఆ సీన్స్ అన్నీ హీరోలే చేశారని నమ్మేస్తారు. కానీ, సినిమాల్లో ఆ సీన్స్ చేయడానికి హీరోలకు డూప్స్ ఉంటారు. కొంచం రిక్స్ అనిపించే షాట్స్ ను వారితో చేయిస్తారు. అలా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు కూడా ఒక డూప్ ఉన్నాడు. చాలా సినిమాల్లో ప్రభాస్ డూప్ గ కనిపించి మెప్పించాడు. అతని పేరు కిరణ్ రాజ్.
అతను చాలా సినిమాల్లో ప్రభాస్ డూప్ గా నటించాడు కిరణ్ రాజ్. బాహుబలి, సాహో, సలార్ వంటి చాల సినిమాల్లో నటించాడు అతను. అయితే తాజాగా కిరణ్ రాజ్ గురించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే.. ప్రభాస్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కల్కి. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ భారీ సినిమాపై హైప్ ఒక రేంజ్ ఉంది. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ చాలా ఎక్కువగా ఉండనున్నారని టాక్. హాలీవుడ్ రేంజ్ లో ఆ యాక్షన్ సీక్వెన్సెస్ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తాయని. అయితే ఈ సినిమాలో కూడా చాలా సీన్స్ కోసం ప్రభాస్ డూప్ ను వాడారట. అయితే ఈ నేపధ్యంలోనే కిరణ్ రాజ్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ నెట్టింట వైరల్ గా మారింది.
ప్రభాస్ డూప్ గా చేయడానికి కిరణ్ రాజ్ ఒకరోజుకి రూ.30 లక్షలు తీసుకుంటున్నాడట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎందుకంటే.. డూప్ అంటే రోజుకి లక్ష తీసుకోవడమే ఎక్కువ అలాంటిది.. కేప్రభాస్ డూప్ ఒక్కొరోజుకి ఏకంగా రూ.30 లక్షలు తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు. అలా చూసుకుంటే ఒక్కో సినిమాకు పది రోజులు పనిచేసినా రూ.3 కోట్లు అన్నమాట. ఇది చాలా మంది స్టార్ కంటే చాలా ఎక్కువ. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ న్యూస్ నిజమా కదా అనేది తెలియాల్సి ఉంది.