![Prabhas Fans: ప్రభాస్ ఫ్యాన్స్ మౌన దీక్ష.. పాపం వీళ్ళ కష్టం ఎవరికీ రాకూడదు!](https://static.v6velugu.com/uploads/2024/06/prabhas-fans-silence-protest-for-kalki-movie-tickets_bSKWIOFy7M.jpg)
మాములుగా ఫ్యాన్స్ అంటే ఎలా ఉంటారు? ఈలలు వేస్తూ.. గోల చేస్తూ.. అరుస్తూ.. కేకలుపెడుతూ.. నానా రచ్చ చేస్తారు కదా. కానీ, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం మేము అలా కాదంటున్నారు. తమ హీరో టికెట్స్ కోసం వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్స్ అవాక్కవుతున్నారు.
ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. యంగ్ రెబల్ స్టార్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కల్కి 2898 ఏడీ. ఇండియన్ మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ కథాంశంతో వస్తున్న ఈ సినిమాను దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడు. దాదాపు రూ.600 కోట్ల భారీ బడ్జెట్ తో హాలీవుడ్ రేంజ్ లో వస్తున్న ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ఇండియా వైడ్ గా ఉన్న సినీ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక అన్ని కార్యక్రామాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా జూన్ 27న విడుదల కానుంది.
అయితే.. కల్కి 2898 ఏడీ విడుదల నేపధ్యంలో ఇప్పటికే ఆన్లైన్ లో టికెట్ బుకింగ్స్ కూడా ఓపెన్ చేశారు. వాటికి భారీ డిమాండ్ కూడా ఏర్పడటంతో.. క్షణాల్లోనే అన్ని టికెట్స్ అమ్ముడైపోయాయి. అయితే.. కొన్నిచోట్ల మాత్రం ఇంకా టికెట్ బుకింగ్స్ ఓపెన్ అవలేదట. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ కొంతమంది కల్కి నిర్మాత అశ్వినీదత్ ఆఫీస్ ముందు మౌన దీక్షకు దిగారు. తమ ప్రాంతాల్లో కూడా వెంటనే టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవగా.. నెటిజన్స్ రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. టికెట్స్ కోసం మౌన దీక్ష చేయడం ఏంటి భయ్యా.. ఇవ్వాలో.. రేపో.. రిలీజ్ చేస్తారు కదా. దానికి ఇంత సీన్ క్రియేట్ చేయడం అవసరమా. అంటున్నారు. మరికొందరేమో.. పాపం.. మీ కష్టం కష్టం ఎవరికీ రాకూడదు.. అంటూ వెటకారంగా కామెంట్స్ చేస్తున్నారు.