యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా 2007వచ్చిన మూవీ యోగి. మాస్ డైరెక్టర్ వీవీ వినాయక్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా.. ఫ్లాప్ గా నిలిచింది. తాజాగా ఈ సినిమాను రిలీజ్ చేశారు మేకర్స్. ఆగస్టు 18న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ థియేటర్స్ దగ్గర హంగమా చేశారు. కొంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ థియేటర్ లోపల కూడా వీరంగం సృష్టించారు.
థియేటర్ లో సినిమా ప్లే అవుతున్న సమయంలో స్క్రీన్ దగ్గర డాన్స్ చేశారు. దాంతో అందులో కొంతమంది అదుపుతప్పి స్క్రీన్ మీద పడటంతో స్క్రీన్ రెండు చోట్ల చిరిగిపోయింది. ఈ ఘంటన ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లా శ్రీప్రియ థియేటర్లో చోటుచేసుకుంది. కొంతమంది అంతటితో ఆగకుండా కుర్చీలు కూడా ధ్వంసం చేసారు. దీంతో థియేటర్ యాజమాన్యం తీవ్ర ఆగ్రహానికి గురైంది. యాజమాన్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.