Prabhas: ప్రభాస్‌ ఫౌజీ మూవీ షూటింగ్‌ అప్‌డేట్‌

Prabhas: ప్రభాస్‌ ఫౌజీ మూవీ షూటింగ్‌ అప్‌డేట్‌

వరుస పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు ప్రభాస్.  హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న పీరియాడికల్ మూవీ కూడా అందులో ఒకటి.  ఈ చిత్రంలో ప్రభాస్‌‌కు జంటగా ఇమాన్వీ నటిస్తోంది. ఈ మూవీ కొత్త షెడ్యూల్‌‌ బుధవారం నుంచి మొదలవుతోంది. ఆమధ్య షూటింగ్‌‌లో కాలికి స్వల్ప గాయం అవడంతో డాక్టర్స్ సలహా మేరకు రెస్ట్ తీసుకున్న ప్రభాస్.. తిరిగి ఈ షూటింగ్‌‌లో పాల్గొనబోతున్నాడు. సుమారు రెండు నెలల పాటు ఈ షెడ్యూల్ కొనసాగనుందని తెలుస్తోంది.  

హైదరాబాద్‌‌లో ప్రత్యేకంగా వేసిన సెట్స్‌‌లో లీడ్ యాక్టర్స్‌‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు. ‘ఫౌజీ’ అనే టైటిల్‌‌ ప్రచారంలో ఉన్న ఈ చిత్రంలో ప్రభాస్‌‌ సైనికుడిగా కనిపించబోతున్నాడు. మరోవైపు మారుతి తెరకెక్కిస్తున్న ‘ది రాజా  సాబ్‌‌’ చిత్రం కూడా సెట్స్‌‌పై ఉంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందనున్న ‘స్పిరిట్‌‌’ మే నుంచి సెట్స్‌‌కు వెళ్లబోతోంది. ఇవి పూర్తయ్యాక సలార్ 2, కల్కి 2  పట్టాలెక్కనున్నాయి.