Prashanth Neel: సలార్ 2తో సత్తా చాటేందుకు డైరెక్టర్ ప్రశాంత్ తీవ్ర నీల్ కసరత్తు

Prashanth Neel: సలార్ 2తో సత్తా చాటేందుకు డైరెక్టర్ ప్రశాంత్ తీవ్ర నీల్ కసరత్తు

ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన ‘సలార్’ చిత్రం విడుదలై నిన్నటితో (డిసెంబర్ 22) ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా  టీమ్ వన్ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకుంటోంది. భారీ అంచనాల మధ్య  ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘సలార్, పార్ట్ 1 సీజ్ ఫైర్’ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.700 కోట్లు  వసూళ్లు చేసింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ 300 రోజులు కంటిన్యూగా ట్రెండింగ్‌‌‌‌‌‌‌‌లో కొనసాగి కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

అయితే ‘సలార్ పార్ట్‌‌‌‌‌‌‌‌1’ కమర్షియల్‌‌‌‌‌‌‌‌గా హిట్ అయింది కానీ థియేట్రికల్ పెర్ఫార్మెన్స్ విషయంలో తాను పూర్తి సంతోషంగా లేనని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అన్నాడు. సినిమా విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన సలార్ కోసం చాలా కష్టపడ్డానని, కానీ అనుకున్నంత సంతృప్తి  కలగలేదని  చెప్పాడు.

సలార్ 2 విషయంలో మాత్రం తన బెస్ట్ ఇస్తున్నా అని అన్నాడు. తన సత్తా ఏమిటో చూపిస్తానన్నాడు. భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌‌‌‌‌‌‌‌తో ప్రభాస్ స్ర్కీన్ ప్రెజెన్స్ ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తాయన్నాడు. ప్రస్తుతం  ‘సలార్ 2, శౌర్యంగపర్వ’  షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.