అదే నా లక్ష్యం.. సలార్ 2పై స్ట్రాంగ్ అప్డేట్ ఇచ్చిన ప్రభాస్

అదే నా లక్ష్యం.. సలార్ 2పై స్ట్రాంగ్ అప్డేట్ ఇచ్చిన ప్రభాస్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ సలార్(Salaar). కేజీఎఫ్(Kgf) చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్(Prashanth Neel) తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మిక్సుడ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో సాధించింది ఈ మూవీ. కేవలం ఆరు రోజులోనే రూ.500 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా కలెక్షన్స్ ఒక్కసారిగా డ్రాప్ అయ్యాయి. నిజానికి ఈ సినిమాకు వచ్చిన హైప్ కారణంగా ఖచ్చితంగా వెయ్యి కోట్లకు పైగా వసూలు చేస్తుంది అని అనుకున్నారంతా. కానీ, అది జరగలేదు.
 
అయితే సలార్ పార్ట్ 1కు వచ్చిన మిక్సుడ్ టాక్ పై దర్శకుడు ప్రశాంత్ నీల్ సైతం స్పందించారు. ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ.. సలార్ పై వస్తున్న కామెంట్స్ నేను కూడా విన్నాను. దానిని నేను కూడా అంగీకరిస్తున్నారు. కానీ, పార్ట్ 2గా రాబోతున్న శౌర్యాంగ పర్వానికి సలార్ పార్ట్ 1 జెస్ట్ ఇంట్రడక్షన్ లాంటిది. పార్ట్ 1లో కేవలం పాత్రలు మాత్రమే పరిచయం అయ్యాయి. అసలు కథ అంతా శౌర్యాంగ పర్వంలోనే ఉంటుంది. కాబట్టి పార్ట్ వ మిమ్మలి డిజప్పాయింట్ చేయదు.. అని చెప్పుకొచ్చారు. దీంతో సలార్ పార్ట్2 పై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. 

ఈ నేపధ్యంలో సలార్ రిలీజ్ పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు ప్రభాస్. ఇటీవల ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. సలార్ సీక్వెల్ కథ ఇప్పటికే సిద్ధమైంది. త్వరలోనే షూటింగ్ మొదలుకానుంది. తొందరగా షూటింగ్ కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాము. ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారని తెలుసు. త్వరలోనే పార్ట్2కి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాము.. అంటూ చెప్పుకొచ్చారు. దీంతో సలార్ పార్టీ 2 2024నే రానుంది అనే విషయంపై క్లారిటీ వచ్చేసింది. ఈ న్యూస్ తెలుసుకున్న ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.