ప్రభాస్(Prabhas) పెళ్లెప్పుడు? అమ్మాయి ఎవరు?.. కొంతకాలంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ఇది. అయితే ఇదే విషయాన్ని ప్రభాస్ ను ఎన్నిసార్లు అడిగినా అయన మాత్రం నవ్వుతూనే దాటవేసే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు మరోసారి ప్రభాస్ పెళ్లి విషయం తెరపైకి వచ్చింది. దానికి కారణం ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి.
తాజాగా ఆమె దేవీ నవరాత్రుల సందర్భంగా విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న విలేకరులు పెద్దఎత్తున దుర్గ గుడివద్దకు చేరుకున్నారు. ఈ సందర్బంగా విలేకరులు ఆమెను ప్రభాస్ గురించి అడిగారు? దానికి ఆమె బదులుగా శ్యామలాదేవి మాట్లాడుతూ.. కృష్ణంరాజు గారి పేరును నిలబెడుతూ మా కుటుంబంలో అందరూ ముందుకు సాగుతున్నారు. ఆయన బతికి ఉన్నప్పుడే ప్రభాస్ పెళ్లి జరగాలని అనుకున్నాం కానీ.. ప్రభాస్ వరుస సినిమాలు ఒప్పుకోవడం, షూటింగ్స్ బిజీ వల్ల అది జరగలేదు. ఇప్పుడిక ఆలస్యం చేసే ప్రసక్తి లేదు. అమ్మాయి ఎవరు? డేట్, టైం వివరాలు చెప్పలేను కానీ.. త్వరలోనే ఆ శుభకార్యం జరుగుతుంది. వచ్చే దసరా పండగనాటికి ప్రభాస్ ఓ ఇంటివాడు అవుతాడు.. అంటూ గుడ్ న్యూస్ చెప్పారు శ్యామలాదేవి.
Also Read :- అది సెక్స్ సీన్ కాదు
ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ వార్త ఎప్పుడు వింటామా అని ఎదురుచూస్తున్న డార్లింగ్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సలార్ సినిమా చేస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో రానున్న ఈ యాక్షన్ ఓరియెంటెడ్ మూవీ డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.