కల్కి (Kalki 2898 AD) మూవీ పదిహేను రోజులకు గాను రూ.1000 కోట్లకుపైగా వసూళ్లను సాధించిన నేపథ్యంలో అభిమానుల్ని ఉద్దేశించి ప్రభాస్(Prabhas) ప్రత్యేకంగా మాట్లాడారు.ఇందుకు సంబంధిత వీడియోను ‘స్వీట్ నోట్’పేరుతో కల్కి మేకర్స్ రిలీజ్ చేశారు.
'హాయ్ మై ఫ్యాన్స్..థ్యాంక్యూ సో మచ్..‘మీరు లేనిదే నేను లేను..’అంటూ డార్లింగ్ ఫ్యాన్స్ కు స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు ప్రభాస్."ఈ సినిమా కోసం 5 ఏళ్లపాటు ఎంతో కష్టపడి తెరకెక్కించిన టాలెంటెడ్ డైరెక్టర్ నాగ అశ్విన్,అలాగే సినిమాను ఎంతో గ్రాండ్ గా నిర్మించిన ప్రొడ్యూసర్ అశ్విని దత్, స్వప్న,ప్రియాంక లకు స్పెషల్ థాంక్స్ తెలిపారు.
బిగ్ స్టార్స్ కమలహాసన్,అమితాబచ్చన్,కమల్ హాసన్ సర్ ల సినిమాలు చూస్తూ పెరిగిన వాడినని..ఇప్పుడు వాళ్లతో నటించడం పట్ల చాలా సంతోషం ఉందంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.ఇక చివరగా మోస్ట్ గార్జియస్ దీపికా పదుకొనే కల్కి సినిమాలో నటించడం పట్ల థాంక్స్ తెలిపాడు.తర్వాత రాబోయే కల్కి 2 మూవీ మరింత గ్రాండ్ గా ఉండబోతుందంటూ ప్రభాస్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కల్కి మూవీ ఇంకా థియేటర్స్ లో విజయవంతంగా రన్ అవుతోంది.వీకెండ్ లో కూడా కొన్ని చోట్ల థియేటర్స్ ఫుల్ అవుతుండం చూసి మేకర్స్ తో పాటు డార్లింగ్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.
A sweet note from our Bhairava, Karna a.k.a #Prabhas, as we celebrate the blockbuster success of #Kalki2898AD ❤️
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 14, 2024
- https://t.co/KTw6Mnkl7w#EpicBlockbusterKalki @SrBachchan @ikamalhaasan @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD… pic.twitter.com/7U5R0qr7Jo
గతంలో ప్రవరల్డ్ వైడ్ గా రూ.1000 కోట్లు కలెక్షన్లు రాబట్టిన చిత్రాలు చూసుకుంటే..బాలీవుడ్ స్టార్ హీరోగా అమిర్ ఖాన్ నటించిన స్పోర్ట్స్ డ్రామా మూవీ దంగల్.ఈ మూవీ రూ.2024 కోట్లు సాధించగా..ప్రభాస్ బాహుబలి-2 రూ.1810.60 కోట్లు,ఎన్టీఆర్,చరణ్ RRR రూ.1387.26కోట్లు,యష్,ప్రశాంత్ నీల్ KGF రూ.1250 కోట్లు,షారుక్ ఖాన్ పఠాన్ మూవీ రూ.1050కోట్లు,కాగా జవాన్ రూ.1148.32కోట్ల కలెక్షన్లు సాధించాయి.
1000 CRORES and counting…💥
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 13, 2024
This milestone is a celebration of your love. We poured our hearts into this film, and you embraced it with open hearts.
Thank you to the audience across the world ❤️ #Kalki2898AD #1000CroreKalki@SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone… pic.twitter.com/0MnJTlRNqO