Prabhas Injure Update: ఏం లేదు టెన్షన్ పడొద్దు : షూటింగ్ లో ప్రభాస్ కు చాలా చిన్న గాయం..

Prabhas Injure Update: ఏం లేదు టెన్షన్ పడొద్దు : షూటింగ్ లో ప్రభాస్ కు చాలా చిన్న గాయం..

టాలీవుడ్ స్టార్ స్టార్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఓ సినిమా షూటింగ్లో గాయపడ్డారు. ఈ క్రమంలో ప్రభాస్ యాక్షన్ సన్నివేశాన్ని షూట్ చేస్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ప్రభాస్ కాలు బెణికినట్లు సమాచారం. గాయం తీవ్రత పెద్దగా లేకపోయినప్పటికీ విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని కల్కి చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా అభిమానులకి తెలిపారు. 

అయితే ప్రభాస్ ఈ డిసెంబర్ 18న జపాన్ భాషలో రిలీజ్ కాబోతున్న కల్కి2898AD సినిమా ప్రమోషన్స్ కోసం వచ్చే ఏడాది జనవరి 03 న జపాన్ కి వెళ్లాల్సి ఉంది. కానీ ప్రభాస్ షూటింగ్ లో గాయపడటంతో ఈ ప్రమోషన్స్ కి కల్కి సినిమా డైరెక్టర్ నాగ్ అశ్విన్ వెళుతున్నట్లు చిత్రయూనిట్ తెలిపింది. ఇక ప్రభాస్ గాయపడిన విషయం తెలుసుకున్న అభిమానులు అయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

ALSO READ | Vignesh Shivan and Nayanthara: నేనేంటీ.. హోటల్ కబ్జా చేయటం ఏంటీ.. : నయనతార భర్త ఓపెన్ లెటర్

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ప్రభాస్ తెలుగులో ప్రముఖ డైరెక్టర్ మారుతీ దాసరి దర్శకత్వం వహిస్తున్న ది రాజాసాబ్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా నిధి అగర్వాల్, మాళవిక మోహన్ నటిస్తున్నారు. ది రాజాసాబ్ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 10న రిలీజ్ కాబోతోంది. అయితే ప్రస్తుతం ప్రభాస్ విశ్రాంతిలో ఉండటంతో సినిమా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చాడు. దీంతో రాజాసాబ్ కి సంబంధించిన కీలక సన్నివేశాల షూటింగ్ ఆగిపోయినట్లు సమాచారం.