Kannappa: కన్నప్పలో శివుడు ప్రభాసే.. క్లారిటీ వచ్చేసింది

మంచు ఫ్యామిలీ(Manchu Family) ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా కన్నప్ప. దాదాపు రూ.100 కోట్ల భారీ బడ్జెట్ తో అవా క్రియేషన్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో మంచు విష్ణు(Manchu Vishnu) ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్(Mukesh Kumar Singh) నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇండియా వైడ్ గా ఉన్న చాలా మంది స్టార్స్ నటిస్తున్నారు. వారిలో.. ప్రభాస్, నయనతార, మోహన్ లాల్, శివరాజ్ కుమార్ ఉన్నారు. తాజాగా ఈ లిస్టులో చేరాడు బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్.

అయితే అక్షయ్ కుమార్ ఈ సినిమాలో నటిస్తున్నారు అని తెలిసినప్పటి నుండి అయన శివుడి పాత్రలో కనిపించనున్నాడు అనే వార్తలు వైరల్ అయ్యాయి. కారణం.. అక్షయ్ ఇటీవల శివుడిగా కనిపించిన ఓ మై గాడ్ 2 మూవీ మంచి విజయాన్ని సాధించింది. అందుకే ఈ సినిమాలో కూడా ఆయన శివుడిగా చేస్తున్నారు అనే కామెంట్స్ వినిపించాయి. అయితే.. వార్తలతో ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త డిజప్పాయింట్ అయ్యారు. ఎందుకంటే.. ముందుగా కన్నప్ప సినిమాలో శివుడిగా ప్రభాస్ అనుకున్నారు కాబట్టి. 

అయితే తాజాగా సమాచారం ప్రకారం.. కన్నప్ప సినిమాలో మహాశివుడిగా కనిపించేది ప్రభాస్ అని క్లారిటీ వచ్చేసింది. తాజాగా ప్రభాస్ కన్నప్ప సెట్స్ లో అడుగుపెట్టారు అంటూ ఒక పిక్ విడుదల చేశారు మేకర్స్. అందులో శివుడి గెటప్ లో ఉన్న ప్రభాస్ కాలు కనిపించింది. ఈ ఒక్క ఫొటోతో కన్నప్ప సినిమాలో ప్రభాస్ పాత్రపై వస్తున్న కామెంట్స్ కి పులిష్టాప్ పడింది. ఈ న్యూస్ తో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. జస్ట్ కాలు ఇమేజ్ ఈ రేంజ్ లో ఉందంటే.. ఇంకా సినిమాలో ఆయన పాత్ర ఏ రేంజ్ లో ఉంటుందో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.