Prasads Multiplex Tweet: 'కల్కి2898AD'..ఈ పేరు చరిత్ర మర్చిపోదు..ప్రసాద్ మల్టీప్లెక్స్లో ప్రభాస్ ప్రభంజనం

Prasads Multiplex Tweet: 'కల్కి2898AD'..ఈ పేరు చరిత్ర మర్చిపోదు..ప్రసాద్ మల్టీప్లెక్స్లో ప్రభాస్ ప్రభంజనం

ప్రస్తుతం ఇండియాలో ఎక్కడ చూసినా దర్శకుడు నాగ్ అశ్విన్ గురించే చర్చ నడుస్తోంది. కారణం..ఆయన తెరకెక్కించిన కల్కి 2898 AD. ఈ మూవీ రిలీజై 18 రోజులు దాటినా కూడా బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ మేనియాను పెంచుతూ వస్తోంది. ఇప్పటికే కల్కి మూవీ పదిహేను రోజులకు గాను రూ.1000 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టి ఆ పరంపరను కొనసాగిస్తూ వస్తోంది. 

తాజాగా కల్కి మూవీ ప్రసాద్ మల్టీప్లెక్స్ లో రిలీజైన 18 రోజులకు గాను నాలుగు కోట్ల 80 లక్షల గ్రాస్ వసూలు చేసినట్లు ట్విట్టర్ X ద్వారా పోస్ట్ చేసింది. "కల్కి2898AD! ఈ పేరు చరిత్ర మార్చిపోదు..ప్రసాద్ మల్టీప్లెక్స్ వద్ద బాక్సాఫీస్‌ను శాసిస్తోంది" అంటూ ట్వీట్ చేసింది. అలాగే ఈ మూవీ రిలీజైన 18 రోజులకు గాను 400 షోస్ వేయగా మాదాపూర్ 1,20,000 మంది ఈ మల్టీప్లెక్స్ లో కల్కి సినిమాను చూసినట్లు అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే , కల్కి మూవీ అపర్ణ సినిమాస్ మల్టీప్లెక్స్ 2.15 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఇప్పుడు తాజాగా మరొక మల్టీప్లెక్స్ కూడా రికార్డ్ వసూళ్లు సాధించడంతో కల్కి మల్టిప్లెక్స్ ల చరిత్రకు సిగ్నేచర్ క్రియేట్ చేస్తోంది. 

ALSO READ : Horror Comedy OTT: ఓటీటీలో వణుకు పుట్టిస్తున్న హారర్ కామెడీ మూవీ..మూడు రోజుల్లోనే రికార్డు వ్యూస్ సొంతం

 
ఇకపోతే ప్రసాద్ మల్టీప్లెక్స్ను గతంలో ప్రసాద్ ఐమాక్స్ గా పిలుచుకునే వారు. కానీ,ఇప్పుడు ఇందులో ఐమాక్స్ స్క్రీన్ తొలిగించడంతో ప్రసాద్ మల్టీప్లెక్స్ గా పిలుచుకోవడం జరుగుతుంది. ఇదిలా ఉంటే,కల్కి 2898 ఏడీ కలెక్షన్స్ వెయ్యి కోట్లు దాటి రూ.1100 కోట్లకు చేరువకాబోతుంది. ఇక  ఈ మూవీ నిర్మాతలకు రూ.100 కోట్లకు పైగా లాభాలు కల్కి తెచ్చిపెడుతుందని ప్రముఖ ట్రేడ్ సంస్థలు చెబుతున్నాయి.

గతంలో ప్రవరల్డ్ వైడ్గా రూ.1000 కోట్లు కలెక్షన్లు రాబట్టిన చిత్రాలు చూసుకుంటే..బాలీవుడ్ స్టార్ హీరోగా అమిర్ ఖాన్ నటించిన స్పోర్ట్స్ డ్రామా మూవీ దంగల్.ఈ మూవీ రూ.2024 కోట్లు సాధించగా..ప్రభాస్ బాహుబలి-2 రూ.1810.60 కోట్లు,ఎన్టీఆర్,చరణ్ RRR రూ.1387.26కోట్లు,యష్,ప్రశాంత్ నీల్ KGF రూ.1250 కోట్లు,షారుక్ ఖాన్ పఠాన్ మూవీ రూ.1050కోట్లు, కాగా జవాన్ రూ.1148.32కోట్ల కలెక్షన్లు సాధించాయి.