Kalki 2898 AD Collections: రూ.500 కోట్ల మార్కును దాటిన కల్కి కలెక్షన్స్..మరో వారం రోజుల్లో రూ.1000 కోట్ల మార్కును చేరనున్న ప్రభాస్!

Kalki 2898 AD Collections: రూ.500 కోట్ల మార్కును దాటిన కల్కి కలెక్షన్స్..మరో వారం రోజుల్లో రూ.1000 కోట్ల మార్కును చేరనున్న ప్రభాస్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD. దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాను దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించాడు. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది.

తాజాగా ఈ మూవీ (ఆదివారంతో) రూ.500 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టినట్లు కల్కి ప్రొడక్షన్ హౌస్ వైజయంతి మూవీస్ అధికారికంగా ప్రకటించింది. కేవలం మూడు రోజుల్లోనే (శనివారం వరకు) రూ.415 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది.ఈ కలెక్షన్స్ ఇలాగే కొనసాగితే మరో వారం రోజుల్లో రూ.1000 కోట్ల మార్కును దాటేస్తుంది అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

ఈ మూవీలో ప్రభాస్‌. అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దీపికా పదుకొణె  నటన గురించి చెప్పడానికి మాటల్లేవ్. ప్రతి ఒక్కరు తమ తమ పాత్రల్లో అదరగొట్టేశారు. ఇక ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ, ఆర్ట్, కాస్ట్యూమ్స్, ఎడిట్, మేకప్‌, టెక్నీకల్ డిపార్ట్మెంట్స్ గురించి చాలా మంది స్టార్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రపంచస్థాయి సినిమా ప్రమాణాలకు ఏమాత్రం తీసిపోని కల్కి రానున్న రోజుల్లో మరిన్ని అద్భుతాలు క్రియేట్ చేసే పనిలో ఉంది.

Also Read:జూలైలో ఓటీటీలోకి రానున్న సినిమాలు, వెబ్ సిరీస్లు..ఈ వారం 24 సినిమాలు స్ట్రీమింగ్