Kalki 2898 AD Box Office: ప్రభాస్ మేనియా.. రెండోరోజు కల్కి భారీ వసూళ్లు

Kalki 2898 AD Box Office: ప్రభాస్ మేనియా.. రెండోరోజు కల్కి భారీ వసూళ్లు

ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి 2898 ఏడీ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్ల వరద పారిస్తోంది. మొదటి రోజూ ఏకంగా రూ.191 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా రెండోరోజు కూడా అదే జోరును కొనసాగించింది. సినిమా మొదటిరోజు నుండే పాజిటీవ్ టాక్ రావడంతో ఆడియన్స్ ఈ సినిమా చూసేందుకు ఎగబడ్డారు. దాంతో దాదాపు అన్ని ఏరియాల్లో రికార్డ్స్ కలెక్షన్స్ రాబట్టింది.

ఇక కల్కి సినిమా రెండోరోజు కలెక్షన్స్ విషయానికి వస్తే ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు ఈ సినిమా రెండోరోజు రూ.150 కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది. రెండు రోజు కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ రావడంతో.. మరో నాలుగైదు రోజుల్లో ఈ సినిమా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఎదుకంటే.. రానున్న రెండు రోజులు సెలవుదినాలు కావడంతో ఈ సినిమాకు కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశం ఉంది. మరి లాంగ్ రన్ లో కల్కి సినిమా ఏ రేంజ్ కలెక్షన్స్ చేస్తుందో చూడాలి. 

ఇక కల్కి సినిమా విషయానికి వస్తే.. ప్రభాస్ హీరోగా వచ్చిన ఈ సినిమాను దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించాడు. ఇండియన్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, దీపిక పడుకొనే, కమల్ హాసన్ లాంటి స్టార్ క్యాస్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాను రూ.600 కోట్లతో అశ్వినీ దత్ నిర్మించారు. హాలీవుడ్ రేంజ్ లో వచ్చిన ఈ సినిమాలో విజువల్స్, గ్రాఫిక్స్ నెక్ట్ లెవల్లో ఉండటంతో ఆడియన్స్ ఫిదా అయ్యారు.