Kalki Movie Ticket Rates: కల్కి మూవీ బడ్జెట్ రూ.700 కోట్లు.. మరి టికెట్ రేట్లు?

Kalki Movie Ticket Rates: కల్కి మూవీ బడ్జెట్ రూ.700 కోట్లు.. మరి టికెట్ రేట్లు?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), దర్శకుడు నాగ్ అశ్విన్(Nag Ashwin) కాంబోలో వస్తున్న లేటెస్ట్ స్కైఫై మూవీ కల్కి 2898 ఏడీ(Kalki 2898 AD). వైజయంతి మూవీ బ్యానర్ పై నిర్మాత అశ్వినిదత్ నిర్మిస్తున్న ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్, లోకనాయకుడు కమల్ హాసన్ కీ రోల్స్ చేస్తున్నారు. దాదాపు రూ.700 కోట్ల భారీ బడ్జెట్ తో హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీస్ దీపికా పదుకొనె, దిశా పఠాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలున్న ఈ సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదిలా ఉంటే.. కల్కి సినిమా గురించి తాజాగా వినిపిస్తున్న న్యూస్ ఒకటి ఆడియన్స్ షాకవుతున్నారు. అదేంటంటే.. కల్కి సినిమా టికెట్ రేట్స్ భారీగా పెరుగనున్నాయట. అవును.. చాలా కాలంగా భారీ బడ్జెట్ సినిమాలకు ధరలు పెంచుకునే వెసులుబాటు కలిపిస్తోంది ప్రభుత్వం. అది కూడా ఆ సినిమాకు పెట్టిన బడ్జెట్ ను బట్టి టికెట్ రేట్స్ ఫిక్స్ చేస్తారు. ఆలా చూస్తే కల్కి సినిమా కోసం మేకర్స్ దాదాపు రూ.700 కోట్ల బడ్జెట్ ను ఖర్చు చేసింది. 

కాబట్టి ఈ సినిమా రేట్స్ అదే రేంజ్ పెరుగనున్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంతకుముందు ముందు పెద్ద సినిమాలకు రూ.350 నుండి రూ.500 వరకు టికెట్ రేట్స్ పెంచుకునే అవకాశం ఇచ్చారు. ఈ లెక్కన కల్కి సినిమాకు కూడా భారీగానే పెరిగే అవకాశం ఉంది. దాంతో నార్మల్ సినీ లవర్స్ కంగారు పడుతున్నారు. అంత రేట్స్ పెడితే సినిమాను థియేటర్స్ లో చూసే అవకాశం ఉంటుందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.