
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కల్కి 2898 ఏడీ(Kalki 2898 AD). ఇండియన్ మైథాలజీ అండ్ సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాను మహానటి ఫేమ్ దర్శకుడు నాగ్ అశ్విన్(Nag ashwin) తెరకెక్కిస్తున్నాడు. దాదాపు రూ.700 కోట్ల బడ్జెట్ తో హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమాను నిర్మిస్తోంది వైజయంతి మూవీస్ బ్యానర్. జూన్ 27న థియేటర్స్ లోకి రానున్న ఈ సినిమాపై గ్లోబల్ రేంజ్ లో భారీ అంచనాలున్నాయి. ఇక ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్స్ సినిమాపై అంచనాలు పెంచేయగా.. రిలీజ్ కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే.. విడుదల కన్నా ముందు కల్కి 2898 ఏడీ ట్రైలర్ పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
తాజాగా..ఇదే విషయంపై అధికారిక ప్రకటన ఇచ్చారు మేకర్స్. కల్కి సినిమా ట్రైలర్ ను జూన్ 10న విడుదల చేయనున్నట్లు అనౌన్స్ సరికొత్త పోస్టర్ కూడా విడుదల చేశారు. ఇక ఈ ట్రైలర్ తో సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవల్ కు చేరుకోనున్నాయి. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ పండుగా చేసుకుంటున్నారు. ట్రైలర్ తో సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవల్ కు వెళ్లనున్నాయని.. సినిమా కూడా భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవడం ఖాయం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
? ??? ????? ??????!#Kalki2898AD Trailer on June 10th. @SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD @saregamaglobal @saregamasouth #Kalki2898ADonJune27 pic.twitter.com/5FB0Mg6kNi
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) June 5, 2024
ఇక కల్కి సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాలో ప్రభాస్ కి జోడీగా దీపికా పదుకొనె, దిశా పఠాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, లోకనాయుకుడు కమల్ హాసన్ కీ రోల్స్ చేస్తున్నారు. తమిళ సంగీతం దర్శకుడు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా విడుదల తరువాత ఎలాంటి హిస్టరీ క్రియేట్ చేస్తుంది అనేది చూడాలి.