Kalki 2898 AD: ప్రభాస్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. కల్కి ట్రైలర్ అప్డేట్!

ప్రభాస్(Prabhas) ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్న సినిమా కల్కి 2898 AD(Kalki 2898 AD). ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ మూవీగా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇండియన్ మైథాలజీ అండ్ సైన్స్ ఫిక్షన్ కథాంశంతో వస్తున్న ఈ సినిమా పాన్ వరల్డ్ రేంజ్లో రిలీజ్ కానుంది. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఇండియన్ ఆడియన్స్ కు సరికొత్త అనుభూతని అందించనుంది. దాదాపు రూ.600 కోట్ల భారీ బడ్జెట్ తో వైజయంతి మూవీస్ బ్యానర్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

తాజాగా కల్కి 2898 AD సినిమా ట్రైలర్ రిలీజ్ గురించి ఒక న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు కల్కి ట్రైలర్ ఏప్రిల్ 9న రిలీజ్ కానుందట. అంటే సినిమా రిలీజ్ కు సరిగా నెల ముందు ఈ ట్రైలర్ రిలీజ్ కానుంది. భారీ గ్రాఫిక్స్ తో విజువల్ వండర్ గా రానున్న  ట్రైలర్ కల్కి సినిమాపై అంచనాలు పెంచడం ఖాయం అని టాక్. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుంది. 

ఇక కల్కి 2898 AD సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ ప్రత్యేక పాత్రలో కనిపిస్తుండగా.. లోకనాయకుడు కమల్ హాసన్ విలన్ రోల్ చేస్తున్నారు. హీరోయిన్స్ గా బాలీవుడ్ బ్యూటీస్ దీపికా పాడుకొనే, దిశా పటాని నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో నేచురల్ స్టార్ నాని, రౌడీ హీరో విజయ్ దేవరకొండ, మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ కూడా ప్రత్యేక పాత్రల్లో కనిపించనున్నారని సమాచారం. మరి భారీ మల్టీస్టారర్ గా రానున్న ఈ సినిమా ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో చూడాలి.